Pawan Kalyan: ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు.
Pawan Kalyan : ఏపీలో విజయం తర్వాత తెలంగాణ జనసైనికులు ఏం ఆలోచిస్తున్నారు. ఎన్నికల రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ కొండ గట్టు పర్యటనతో జనసైనికులు తెలంగాణలో పవన్ కు మంచి స్వాగతమే లభించింది. వందలాది మంది అభిమానుల ఘన స్వాగతంతో పవన్ ఎలా ఫీలయ్యారు.
తెలంగాణలో జనసేన బలోపేతంపై జనసైనికులు,జనసేనాని ఆలోచన ఏవిధంగా ఉంది. ఫ్యూచర్ లో తెలంగాణలో కూడా జనసేనా ప్రభావం చూపించాలనుకుంటుందా...?Anant radhika merchant: మరో గుడ్ న్యూస్.. పెళ్లైన కొద్ది రోజులకే సంబరాల్లో ముఖేష్ అంబానీ కుటుంబం..: పవన్ కళ్యాణ్ సహా మెగా ఫ్యామిలీకి నైజాం ఏరియాలోనే మంచి మార్కెట్ ఉంది. ఇక్కడే ఎక్కువ మంది అభిమానులున్నారు. ఇక ఏపీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత మొక్కు తీర్చుకోవడానికి జనసేనాని కొండగట్టుకు వచ్చినపుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన ఆవిర్భావ కొత్తలో తెలంగాణలో కూడా చాలా యాక్టివ్ గా పార్టీ ఉంది. వేలాది మంది పవన్ అభిమానులు పార్టీలో సభ్యత్వం తీసుకొని జనసేన కోసం పని చేశారు. తర్వాత తెలంగాణలో ఏర్పడ్డ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా పార్టీ పూర్తిగా స్తబ్దుగా మారింది. బీజేపీతో పొత్తులో ఉన్నా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన జనసేనాని ఆ తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో తిరుగులేని రాజకీయ శక్తిగా జనసేన మారింది. వైసీపీనీ చిత్తు చిత్తుగా ఓడించడంలో జనసేనదే కీలక పాత్ర అని అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికల్లో లోక్ జనశక్తితో పాటు వంద శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసి అన్ని స్థానాలో భారీ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ జనసేన సత్తా ఏంటో తెలుగు రాష్ట్రాలకు చాటేలా చేశారు. తాను ఏళ్లుగా అనుకుంటున్న లక్ష్యానికి మొన్నటి ఎన్నికల్లో సాధించాననన్న ఆనందం జనసేనానిలో కనపడింది. ఈ రోజున ఏపీలో కూటమి అధికారంలో ఉందంటే పవన్ కళ్యాణ్ కారణమని సీఎం చంద్రబాబే ఒప్పుకున్నారంటే పవన్ ఎంతలా ప్రభావం చూపాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అయితే ఏపీలో విజయం తర్వాత తన ఆరాధ్య దైవం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం కోసమని తెలంగాణలో పర్యటించి తన సత్తా చూపించే ప్రయత్నం చేసాడు జనసేనాని. హైదరాబాద్ నుంచి మొదలు కొండగట్టు వరకు పెద్ద ఎత్తున అభిమానులు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. ఎక్కడ చూసినా వందలాది మంది పవన్ అభిమానులు డిప్యూటీ సీఎం అంటూ నినాదాలతో హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కు ఇక్కడ వస్తున్న స్పందన చూస్తుంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా జనసేన పూర్తిగా యాక్టివ్ అవ్వబోతుందేమో అన్న సంకేతాలు క్యాడర్ కు ,అభిమానులకు ఇచ్చారా అన్న సందేహం రాజకీయవర్గాల్లో చర్చ జరగింది. మొన్నటి వరకు నానా మాత్రంగా జనసేన కమిటీలు తిరిగి యాక్టివ్ అవుతాయా అన్న చర్చకు తెరలేసింది. ఏపీలో విజయం తర్వాత తెలంగాణలో కూడా పార్టీనీ తిరిగి బలోపేతం చేయాలని జనసైనికుల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందంట. ఇప్పటికిప్పుడు రాజకీయంగా పెద్దగా ప్రభావం చూపకున్నా..రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి సొంతగా క్యాడర్ ను తయారు చేసుకోవాలనే నిర్ణయానికి జనసేనాని వచ్చినట్టు సమాచారం. తెలంగాణలో పార్టీ బలపడడానికి ఇదే మంచి తరుణంగా జనసైనికులు చెబుతున్నారు. ఎలాగో మరి కొద్ది రోజుల్లోనే స్థానిక ఎన్నికలు తెలంగాణ వ్యాప్తంగా జరగబోతున్నాయి. అక్కడి నుంచే పార్టీ బలోపేతానికి సిద్దం అవ్వాలనే ఆలోచన చేస్తున్నారట జనసైనికులు. అంతకు తగ్గట్టు పవన్ కళ్యాణ్ దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉండడం కూడా పార్టీ బలోపేతానికి కలిసి వచ్చే అవకాశంగా జనసైనికులు భావిస్తున్నారట. ఏపీలో మాదిరి తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీతో కూటమిగా ఏర్పడి స్థాని సంస్థల ఎన్నికల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకూ పోటీ చేస్తే ఇక్కడ అద్భుతాలు చేయవచ్చు అని తెలంగాణ జసనేన ముఖ్య నేతలు ఆశపడుతున్నారట.ఒక సారి పూర్తి స్థాయిలో పార్టీ కమిటీలు ఏర్పడితే ప్రజా సమస్యలపై పోరడాడానికి తాము సిద్దంగా ఉన్నామని జనసైనికులు చెప్పుకొస్తున్నారు. పవన్ అభిమానులు, తెలంగాణ జన సైనికులు ఆలోచనా ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పటి వరకు ఏదీ స్పష్టత ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే ఏపీలో అధికార భాగస్వామిగా ఉన్న తమపై అనేక భాద్యతలు ఉన్నాయని.. ప్రస్తుతానికి ఏపీ రాజకీయాలపైనే తమ దృష్టి అంతా అని పవన్ సైలెంట్ అవుతారా అనేది చూడాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణలో పార్టీనీ యాక్టివ్ చేయాలన్న జనసైనికుల కలలపై కళ్యాణ్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Bengaluru Woman: మార్నింగ్ వాక్ కు వెళ్లిన మహిళ.. వెనుక వైపు నుంచి గట్టిగా వాటేసుకుని.. వైరల్ గా మారిన వీడియో..Bangladesh
Telangana AP Assembly Elections Pawan Kalyan BJP TDP Game Changer
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Vijayashanthi: చంద్రబాబును నమ్మొద్దు.. మళ్లీ తెలంగాణ ఉద్యమిస్తుంది: విజయశాంతి హెచ్చరికVijayashanthi Sensational Comments On Chandrababu: తెలంగాణలో చంద్రబాబు పర్యటన అనుమానంగా ఉందని జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలనే విజయశాంతి పునరుద్ఘాటించారు. చంద్రబాబు స్వార్థానికి తెలంగాణలో పర్యటించారని ఆరోపించారు.
Read more »
AP Congress: జగన్ తో పోయింది షర్మిలతో సెట్ చేస్తారా.. ఏపీ కాంగ్రెస్ ప్లాన్ అదేనా..!AP Congress: ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి....తెలంగాణలో గెలుపుతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అద్భుతాలు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ హై కమాండ్ ఉందా..
Read more »
Jio Cheapest plan: జియో అదిరిపోయే ఈ రీఛార్జ్ ప్లాన్ పై ఓ లుక్కేశారా? రూ. 479.. 84 రోజుల వ్యాలిడిటీ..Reliance Jio Cheapet Plans: రిలయన్స్ జియో అతితక్కువ ధరకే రీఛార్జీ ప్లాన్ మీ ముందుకు తీసుకువచ్చింది. మీరు కూడా జియో అన్‌లిమిటెడ్ కాలింగ్ ఎక్కువ రోజుల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ ప్లాన్.
Read more »
CM Ravanth Reddy: సీఎం రేవంత్ ప్రత్యేక ఆదేశాలు.. రంగంలోకి దిగిన ఆమ్రాపాలీ.. ఆ కమిషనర్లకు క్లాసులు..Hyderabad: ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని అనేక చెరువులను సుందరీకరణ చేసేదిశగా చర్యలు చేపట్టారు.ఈ క్రమంలో చెరువుల ఎక్కడ కూడా కబ్జాలకు గురికాకుండా చూడాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Read more »
Tirumala: ఆ వార్తలు అసత్యం.. నమ్మకండి.. తిరుమల భక్తులకు టీటీడీ విజ్ఞప్తి..No Changes In Senior Citizen Darshan: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎంతో మంది భక్తులు నిత్యం సందర్శిస్తుంటారు. దానికి తగిన ఏర్పాట్లను కూడా టీటీడీ ప్రణాళికలను కూడా చేస్తుంది.
Read more »
Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఇంటిని చూశారా.. ఇంద్ర భవనాన్ని తలదన్నేలా జనసేనాని ఇళ్లు..Pawan Kalyan House: పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం రాజకీయాల్లో తలమునకలై ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలు కాకుండా రాజకీయాలే లోకంగా బతుకుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. జనసేనానికి సంబంధించిన కొన్ని పర్సనల్ విషయానికొద్దాం. ఈయన హైదరాబాద్ లో ఉంటున్న ఇల్లు చూసారా.. ? చూడకపోతే.. ఎలా ఉందో మీరు ఓ లుక్కేయండి..
Read more »




