Tirumala Laddu Row Updates is strategy of janasena bjp merger behind pawan kalyan రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం.
Pawan Kalyan Sanathanam: తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతానికి సద్దుమణుగుతోంది. ఈ విషయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన అవతారం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రానున్న కాలంలో మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పట్టనుంది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.Gold Rate: కుప్పకూలిన బంగారం ధర.. ఏకంగా రూ. 20,000 పతనం.. పండగ చేసుకుంటున్న పసిడి ప్రియులు7Th Pay Commission: అదిరిపోయే దసరా కానుక.. ప్రభుత్వ ఉద్యోగులకు 24 గంటల్లో DAతో పాటు జీతాలు రూ.9 వేల పెంపు! Pawan Kalyan Sanathanam: తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కూటమి ప్రభుత్వ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోనే కాదు..దేశమంతా కలకలం రేపాయి. హిందూవుల మనోభావాలకు సంబంధించింది అయినందున ఆందోళన నెలకొంది. ఇదే అదనుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన అవతారం ఎత్తారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకు రాజకీయంగా మైలేజ్ వచ్చిందో లేదో గానీ సుప్రీంకోర్టు తీర్పుతో ఆ పార్టీ ఇరుకున పడింది. అయితే అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్షతో సనాతన డిక్లరేషన్ చేయడం ఆ పార్టీకు మైలేజ్ తెచ్చిపెట్టిందని కొందరి వాదన. పవన్ కళ్యాణ్ సనాతన అవతారం అలవోకగా చేపట్టింది కాదని..దీని వెనుక భారీ వ్యూహమే ఉందని తెలుస్తోంది. అందుకే తిరుమల లడ్డూ కల్తీపై ఆధారాల్లేవని సుప్రీంకోర్టు చెప్పినా పవన్ కళ్యాణ్ తిరుపతి వారాహి సభలో సనాతన వ్యాఖ్యలు తీవ్రం చేశారు. సనాతనం పాటించేవారి పట్ల చట్టాలు కఠినంగా వ్యవహరిస్తున్నాయని, ధర్మాన్ని వ్యతిరేకించేవారికి న్యాయస్థానాలు సైతం రక్షణ కల్పిస్తున్నాయని చెప్పడం ఇందుకు ఉదాహరణ. అంతేకాకుండా దేశంలో సనాతనం పరిరక్షణకు ఓ వ్యవస్థ ఉండాలని ప్రకటించారు. ఈ వ్యాఖ్యల వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలోని హిందూ ఓట్ల సమీకరణే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. ఉత్తారాదిన బీజేపీ అనుసరిస్తున్న హిందూత్వ విధానాన్ని పవన్ కళ్యాణ్ అందిపుచ్చుకున్నాడని సమాచారం. అంతేకాకుండా రాష్ట్రంలో నిలదొక్కుకోవాలని ఎప్పట్నించో భావిస్తున్న బీజేపీకు పవన్ కళ్యాణ్ ఓ ఆయుధం కావచ్చని తెలుస్తోంది. అందుకే చాలాకాలంగా జనసేన-బీజేపీ విలీన ప్రతిపాదన నడుస్తోంది. ఒకవేళ జమిలి ఎన్నికలు సంభవిస్తే..అప్పటిలోగా విలీనం పూర్తి చేయాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. అదే జరిగితే పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖచిత్రం కానున్నారు. ఎందుకంటే బీజేపీకు సొంతంగా పోటీ చేసినప్పుడు రాష్ట్రంలో ఎప్పుడూ డిపాజిట్లు కూడా దక్కలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ కొన్ని ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు గెల్చుకుంటోంది. ఇప్పటి వరకూ ఆ పార్టీకు రాష్ట్ర నేతలుగా వ్యవహరించిన వ్యక్తులు కూడా ఆ పార్టీ బలోపేతం కాకపోవడానికి కారణం కావచ్చు. అందుకే బీజేపీ జనసేనాని పవన్ కళ్యాణ్ వైపు చూస్తోంది. సినిమాభిమానులతో పాటు కాపు సామాజిక వర్గం అండ ఉండటంతో జనసేనను విలీనం చేసుకుని హిందూత్వను పైకి తీసుకొస్తే ఏపీలో ఓటు బ్యాంకు పెంచుకోవడమే కాదు..బలోపేతం కావచ్చనేది బీజేపీ ఆలోచన.స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Haryana Elections Results 2024Tirumala: తిరుమలలో దివ్వెల మాధురి ఓవరాక్షన్.. మాడవీధుల్లో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్.. వీడియో వైరల్..
Tirumala Laddu Row Pawan Kalyan Pawan Kalyan Prayaschitha Deeksha Pawan Kalyan Sanathan Avataram BJP-Janasena Merger Janasena Likely To Merge With Bjp
Canada Latest News, Canada Headlines
Similar News:You can also read news stories similar to this one that we have collected from other news sources.
Pawan Kalyan: పవన్ సింప్లిసిటి చూసి హ్యాట్సాప్ చెప్పాల్సిందేPawan Kalyan:మంగళగిరిలోని తన నివాసాన్ని ఇక నుంచి క్యాంపు కార్యాలయంగా మార్చుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్నారు.
Read more »
Pawan Kalyan Vs Mahesh Babu: మహేష్ బాబు ఆ రికార్డును బ్రేక్ చేయలేకపోయిన పవన్ కళ్యాణ్..Pawan Kalyan Vs Mahesh Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఓ హీరో క్రియేట్ చేసిన రికార్డును మరో హీరో బ్రేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. తాజాగా తెలుగులో మహేష్ బాబు సెట్ చేసిన ఓ రికార్డును పవన్ కళ్యాణ్ బ్రేక్ చేయలేకపోయాడు.
Read more »
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ దీక్షల వెనుక పెద్ద వ్యూహమే ఉందా, తెరవెనుక ఏం జరుగుతోందిTirupati Laddu Row reason behind Janasena Chief Pawan Kalyan Deeksha and comments ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల అలవోకగా చేస్తున్నవి కావన్పిస్తోంది. పక్కా వ్యూహం ప్రకారం హిందూత్వ ముఖచిత్రంగా మారేందుకు చేస్తున్నట్టు అన్పిస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ ముఖ చిత్రమే మారిపోవచ్చు.
Read more »
Pawan Kalyan Deeksha: పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష విరమణ..Pawan Kalyan Deeksha: జనసేనాని ఛీప్ ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రాయశ్చిత్త దీక్ష విరమించనున్నారు. ఇందుకు గాను ఆయన రాత్రి తిరుమలకు బయల్దేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంటకు చేరుకున్న ఆయన.. రోడ్డు మార్గంలో తిరుమల అలిపిరి మెట్ల వద్దకు చేరుకున్నారు.
Read more »
KA Paul Pawan Kalyan: చూడు పవన్ కల్యాణ్ తమ్ముడూ.. అంటూ ఉప ముఖ్యమంత్రికి కేఏ పాల్ స్ట్రాంగ్ వార్నింగ్KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Read more »
Janasena: తమిళనాడులో జనసేన జెండా..! పవన్ స్ట్రాటజీ అదేనా..!Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది.
Read more »




